Sunday, 25 January 2015
Saturday, 24 January 2015
MANCHI MATALU..
1) మనిషిని ప్రమాదంలో గమ్యం చేర్చేది ధైర్యమే.
2) ధైర్యం లేని జన్మ
నిష్ప్రరయోజనం.
3) నువ్వు చేసేపని నీకు సంతోషంగా ఉంటే నీజీవితం ఆనoదంగా ఉంటుంది.
MANCHI MATALU
1) సంతోషంగా నవ్వుతూ ఉండు
అప్పుడే నీచుట్టు ఉన్నవారిని నిరుత్సహపరచవు.
2) విజయం సాధించడానికి
అవసరమైనదంతా ముందే నేర్చుకో.
నీ కున్న శక్తికి కృషి మెరుగు
పడుతుంది లోపాల్ని సరిదిద్దుతుంది.
3) చిత్తశుద్ది,పట్టుదల,ఓర్పు ఈ మూడు
కార్యసిద్ధికి అవసరం.
4) నువ్వు చేయగలిగిన పని ఎదుటి
వారి ద్వారా చెయిoచడంలోనే నాయకత్వంప్రతిభ ఉంది.
Friday, 23 January 2015
రథ సప్తమి - సూర్యఆరాధనా
రథ సప్తమి - సూర్యఆరాధనా
మాఘశుద్ధ సప్తమినాడు రథసప్తమి పండుగను చేసుకుంటారు. ఈ రోజు ముఖ్యంగా సూర్యుణి ఆరాధిస్తారు. ఈనాటి అరుణోదయాన స్నానమాచరించడం మహా పుణ్యదాయకం.
మాఘశుద్ధ
షష్టిరోజు రాత్రి ఉపవాసం చేసి రెండవ రోజు మాఘస్నానం చేసి, సూర్యదేవాలయానికి గాని, లేదా
ఇతర దేవాలయాలకుగాని వెళ్లి భక్తితో సూర్యుని ధ్యానించి ధైవపూజ జరిపిన వారికి వెనుకటి
జన్మలోగాని, లేక ఈ జన్మలోగాని చేసిన ఏడు విధాలైన పాపాలు, సకల వ్యాధి దుఖాలు తొలగి పోతాయని
ధర్మ సింధువు, వ్రత చూడూ మణి మొదలైన గ్రంధాలలో చెప్పబడి వుంది. మాఘశుద్ధ సప్తమినాడు
ఉదయాన్నే లేచి, బంగారు, వెండి, రాగి తో చేయబడిన ప్రమిదలోగని, లేక మట్టి ప్రమిదలోగాని
ఆకుదొన్నెలోగాని నూనె పోసి వత్తివేసి దీపాన్ని వెలిగించి, దానిని తలపై వుంచుకొని నదుల్లో
గాని, పారే కాలువలో గాని వదిలిపెట్టి నువ్వుల పిండితో ఒళ్ళు రుద్దుకుని, ఏడు జిల్లేడ
ఆకుల ఏడు రేగు ఆకులు ఏడు చిక్కుడు ఆకులు తలపై ఉంచుకుని సూర్య భగవానుణ్ణి ధ్యానిస్తూ
స్నానం చేయాలి.
ఆ తర్వాత ఇంట్లో ఓ
మండపం తయారుచేసి, అరటి స్తంభములు, మామిడి తోరణాలు కట్టి పూలతో అలంకరించి ఓ పీట వేసి దానిపై బియ్యం పోసి, వెండి, బంగారం లేదా ఇతర
లోహాలతో చేసిన సుర్యవిగ్రహాన్ని వుంచి, దీపాన్ని వెలిగించి మంత్రోక్తంగా పూజ చేయాలి.
ఇక ఆ రోజు రాత్రికి భోజనం చేయకుండా ఉపవాసం వుండి నేలపై పడుకోవాలి. ఇలా భక్తిశ్రద్ధలతో
ఎవరైతే చేస్తారో వారికి అన్ని వ్యాధులూ తొలిగి, సూర్యదేవుని అనుగ్రహం పొంది సర్వ సౌఖ్యాలు
అనుభవిస్తారని శ్రీకృష్ణుడు ధర్మ రాజుకు తెలియజేశాడు.
జనని సప్త త్వంహి లోకానాం
సప్తమి సప్త సప్తికే
సప్తవ్యా హృతికే దేవి
నమస్తే సుర్యోమాతృకే !
సప్తాశ్వములుగల ఓ సప్త మీ! నీవు సకల భుతాలకు, లోకాలకు జననివి. సూర్యునికి తల్లివైన నీకు నమస్కారం. అనే మంత్రంతో సూర్యుని పూజించాలి. తరువాత పితరులకు తర్పణములు వదలాలి.
Subscribe to:
Posts (Atom)